ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (09:41 IST)

శృంగారానికి నో చెప్పిందని యువతి ముక్కు కోసేసిన యువకులు.. ఎక్కడ?

victim woman
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం ఆగట్లేదు. వారిపై వేధింపులు తరచూ జరుగుతూనే వున్నాయి. తాజాగా, శృంగారానికి ఒప్పుకోలేదని పాకిస్థాన్‌లో ఓ యువతి ముక్కు కోశారు నలుగురు యువకులు. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని డేరా ఘాజీ ఖాన్‌కు చెందిన ఓ న‌లుగురు యువ‌కులు క‌లిసి ఓ యువ‌తిని నిర్భంధించారు. త‌మ‌తో శృంగారంలో పాల్గొనాల‌ని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. 
 
యువ‌తి కాళ్లు, చేతులను క‌ట్టేశారు. ఆ త‌ర్వాత ప‌దునైన క‌త్తితో ఆమె ముక్కును కోసేశారు. అనంత‌రం పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘ‌ట‌న‌ను త‌మ సెల్‌ఫోన్ల‌లో బంధించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. న‌లుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు.