Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్‌పై అణు బాంబులతో దాడికి సిద్ధమవుతున్న పాకిస్థాన్?

బుధవారం, 11 అక్టోబరు 2017 (10:51 IST)

Widgets Magazine
nucler bomb

భారత్‌పై అణు బాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివిధ అంశాలపై అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను భారత్ ఏకాకి  చేస్తోంది. ముఖ్యంగా, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచ వేదికలపై భారత్ ఎండగడుతోంది. పైగా, భారత్ తెచ్చిన ఒత్తిడి కారణంగా పాక్ ఇచ్చే నిధులను కూడా అమెరికా నిలిపివేసింది. దీంతో భారత్‌పై కక్షగట్టిన పాకిస్థాన్... అణ్వాయుధాలను ఎక్కుపెడుతోందని రిపోర్టులు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ చేతిలో దాదాపు 140 అణు ఆయుధాలు ఉండవచ్చని ఓ అంచనా. వీటన్నింటినీ ఓ రహస్య ప్రదేశంలో దాచేందుకు పాక్ యత్నిస్తోంది. దీనికోసం సొరంగాన్ని నిర్మిస్తోందని ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్ పేర్కొంది. పాక్‌లోని మియన్ వాలీ పట్టణం సమీపంలో ఈ సొరంగాన్ని నిర్మిస్తోందని తెలిపింది. 
 
ఈ సొరంగాలు ఉన్న ప్రదేశానికి మిస్సైల్ లాంచర్లను తీసుకెళ్లేందుకు వీలుగా భారీ రోడ్లను కూడా నిర్మిస్తోందట. మియన్ వాలీ పట్టణం భారత్‌కు సమీపంలో ఉంటుంది. అమృతసర్‌కు 350 కిలోమీటర్లు, ఢిల్లీకి 750 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తక్కువ దూరంలోనే అణ్వాయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా... భారత్‌పై దాడికి సన్నద్ధంగా ఉండాలనేదే పాకిస్థాన్ ఆలోచనగా ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జై షా ఆస్తులపై విచారణ జరిపించాలి : ఏచూరి డిమాండ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా కంపెనీ పెరుగుదల, ఆయన ఆస్తులపై విచారణ ...

news

యేడాదిలో కొడుకు కంపెనీ 16 వేల రెట్లు వృద్ధి... చిక్కుల్లో అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా చిక్కుల్లో పడ్డారు. ఈయన ...

news

పయ్యావులా? కేసీఆర్‌తో నీకెందుకంత సాన్నిహిత్యం?: చంద్రబాబు క్లాస్

పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌పై ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ...

news

చంద్రబాబూ నిజాలు తెలుసుకుని మాట్లాడండి.. పయ్యావుల అసహనం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం ...

Widgets Magazine