మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (13:30 IST)

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌కు కరోనా? - స్వీయ నిర్బంధంలోకి....

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు అబ్దుల్ ఎది కుమారుడు, ప్రముఖ దాత, ఎది ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఫైసల్‌ ఎదిని కలిశారు. ఆ తర్వాత ఆ దాతకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ కూడా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 
 
దాతకు కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశ ప్రధానికి కూడా పాక్ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. మంగ‌ళ‌వారం ఇమ్రాన్ నుంచి శాంపిల్స్ సేకరించారు. స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్ ప్ర‌కారం శ్యాంపిళ్లు సేక‌రించిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. పాజిటివ్ వ్య‌క్తిని ఇమ్రాన్ క‌లిసినందుకు ఈ ప‌రీక్ష త‌ప్ప‌లేదు. 
 
పాక్ ప్రధానిని కలిసిన దాత... 10 మిలియన్ల చెక్కును అందజేశారు. క‌రోనా సోకిన వ్య‌క్తితో ఓ గదిలో 15 నిమిషాలు మాట్లాడినా, లేక అత‌నికి ఆరు అడుగుల దూరంలో ఉన్నా వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పాక్ జాతీయ ఆరోగ్య సంస్థ అభిప్రాయ‌ప‌డింది. 
 
ఇద్ద‌రు షేక్ హ్యాండ్ ఇచ్చుకోక‌పోయినా.. అందుకున్న చెక్ నుంచి వైర‌స్ ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇమ్రాన్‌కు ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.