గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (20:34 IST)

వామ్మో.. పోలాండ్‌కు అమెరికా అడ్డు తగిలిందా?

ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు సంబంధించి ప్రపంచ దేశాలు మౌనంగా వున్నాయి. కానీ ఉక్రెయిన్ దీన పరిస్థితి చూసి పోలండ్ ముందుకు వచ్చింది. కానీ పోలండ్‌ను అగ్రరాజ్యం అమెరికా అడ్డుకుంది. ఈ విషయాన్ని రష్యా వెల్లగక్కింది. అమెరికా గుట్టు ఏంటో దీనినిబట్టి అర్థమయ్యేలా చేసింది.  రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు MiG-29 ఫైటర్ జెట్స్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది పోలండ్. కానీ ఇందుకు అమెరికా అడ్డు తగిలింది. 
 
అగ్రరాజ్యం సాయం చేయకపోగా.. ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్స్ పంపిస్తామని ప్రతిపాదించిన పోలండ్‌ను కూడా అడ్డుకుంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు ప్రత్యక్షంగా అమెరికా సాయం చేయలేకపోయింది. ఇక పరోక్షంగానూ సాయం చేయనివ్వకుండా అడ్డుకుంది. 
 
ఉక్రెయిన్ నాటో దేశాల్లో భాగస్వామిగా ఉండాలని కోరుతోంది. అందుకు రష్యా అంగీకరించడం లేదు. నాటోలో యుక్రెయిన్ చేరితే రష్యాపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తోంది. అందుకే ఉక్రెయిన్ రష్యాలో కలిపేసుకునేందుకు పుతిన్ ఇంతగా ఆరాటపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు నేరుగా అడ్డుచెప్పలేని అమెరికా.. పోలాండ్ వంటి దేశాలను కూడా సాయం చేయనివ్వకుండా ఇలా పరోక్షంగా అడ్డుకుంటోంది.
 
ఒకవేళ రష్యాను కాదని సాయం చేస్తే.. అప్పుడు మొత్తం నాటో కూటమికే ఆందోళన కలిగిస్తుందని అమెరికా అంటోంది. అమెరికా-నాటో ఎయిర్‌ బేస్‌ నుంచి MiG-29 ఫైటర్‌ జెట్లను పోలాండ్ యుక్రెయిన్‌కు పంపడాన్ని తప్పుబట్టింది.