గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (13:19 IST)

మయన్మార్‌లో అంగ్ సాన్ సూకీతో మోడీ భేటీ.. రోహింగ్యా ముస్లింలపై చర్చ?

చైనాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు నుంచే మయన్మార్‌కు వెళ్లారు. అక్కడ మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో బుధవారం సమావేశమయ్యారు. నిజానికి బ్రిక్స్ శిఖర

చైనాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు నుంచే మయన్మార్‌కు వెళ్లారు. అక్కడ మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో బుధవారం సమావేశమయ్యారు. నిజానికి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల కోసం సోమవారం చైనా వెళ్లిన ఆయన... అక్కడి నుంచి మంగళవారం మియన్మార్‌లో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. 
 
మయన్మార్‌ రాజధాని నై పై తాలోని ప్రెసిడెన్సియల్ ప్యాలెస్ వద్ద ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోడీ ఆ దేశ ప్రధాని యూ హాతిన్ క్వాతో సమావేశమై.. 1841 నాటి సాల్వీన్ నది మ్యాప్‌, బోధి వృక్షం జ్ఞాపికలను బహూకరించారు. మోడీ రెండు రోజుల పాటు మయన్మార్‌లో పర్యటించనున్నారు.
 
ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సూకీని కలుసుకున్నారు. భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలపై ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్టు సమాచారం. ప్రధానంగా మయన్మార్‌లో రాఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై పెరుగుతున్న దాడులు, వారు ప్రమాదకరమైన దారుల్లో ప్రయాణించి సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో ఆశ్రయం పొందడంపై చర్చించనున్నారు. కాగా, రోహింగ్యాలు అక్రమంగా వలస వచ్చారనీ... వాళ్లను వెనక్కి పంపేస్తామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటన సైతం వారిమధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.