గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (10:42 IST)

నార్త్ కాలిఫోర్నియా యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పుల కలకలం

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ 30 ఏళ్ల మహిళ విచక్షణారహితంగా జరిపింది. ఈ కాల్పుల్లో నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ 30 ఏళ్ల మహిళ విచక్షణారహితంగా జరిపింది. ఈ కాల్పుల్లో నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. కాల్పుల అనంతరం ఆమె తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయింది. క్షతగాత్రుల్లో ముగ్గురిని జుకర్ బర్గ్ శాన్‌ఫ్రాన్సిస్కో జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
అలాగే కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ 36 యేళ్ల వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. బహుశా.. అతను ఆమె బాయ్‌ఫ్రెండ్ అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బుల్లెట్ గాయమైన మరో వ్యక్తిని కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముందు గుర్తించామని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. కాగా, లంచ్ సమయంలో సదరు మహిళ చేతిలో గన్ పట్టుకుని క్యాంపస్‌లోని డాబా మీదకు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తం 10 రౌండ్ల వరకు కాల్పులు జరిపిందని తెలిపారు. 
 
ఈ ఘటనపై యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజర్ టాడ్ షేర్మన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ ఉద్యోగులు బయటకు పరుగులు పెడుతుంటే భూకంపం వచ్చిందని అనుకున్నానని, కానీ ఓ మహిళ కాల్పులకు పాల్పడినట్టు తర్వాత తెలిసిందని చెప్పారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. బాధితులకు సంఘీభావం తెలిపారు.