మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 26 మార్చి 2018 (16:10 IST)

ప్రియా ప్రకాష్‌ వారియర్‌ను అలా వాడేస్తున్న పోలీసులు...

ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మలయాళీ యువ నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ను పోలీసులు బాగానే వాడేస్తున్నారు. వాడటం అంటే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఆమెను ప్రచారకర్తగా వాడుకోవడమన్నమాట. ప్రియ ఉన్న పోస్టర్‌తో వడోదర సిటీ పోలీసులు వినూత్న ప్ర

ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మలయాళీ యువ నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ను పోలీసులు బాగానే వాడేస్తున్నారు. వాడటం అంటే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఆమెను ప్రచారకర్తగా వాడుకోవడమన్నమాట. ప్రియ ఉన్న పోస్టర్‌తో వడోదర సిటీ పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఏకంగా ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆ ఫోటో వైరల్‌గా మారుతోంది. 
 
కన్ను గీటినంత సేపట్లోనే రోడ్డు ప్రమాదం జరగొచ్చు. పరధ్యానం లేకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అంటూ పక్కనే ప్రియా ప్రకాష్‌ వారియర్ కన్ను గీటే ఫోటో పెట్టారు. అంతేకాదు ఈ పోస్టుకు ఏక్ సంస్కార్ అన్న ట్యాగ్ లైన్ కూడా జోడించారు. ఇలానే ఎందుకు చేశారని పోలీసులను అడిగితే ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వ్యక్తులను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సమాధానం చెబుతున్నారట. మొత్తంమీద ట్విట్టర్లో ఈ పోస్టర్‌ను చూస్తున్న నెటిజన్లు చాలా బాగుందంటూ మెసేజ్‌లు పంపుతున్నారట.