శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (11:45 IST)

ప్రపంచ యుద్ధానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే వున్నాం: పోప్

ఉత్తర కొరియా అణు పరీక్షలు, అమెరికా నిరసన.. చైనా, పాకిస్థాన్‌తో భారత్ సరిహద్దు సమస్యలు ఇవన్నీ చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి అంచనాలు త్వరలో రుజువయ్యే అవకాశాలు

ఉత్తర కొరియా అణు పరీక్షలు, అమెరికా నిరసన.. చైనా, పాకిస్థాన్‌తో భారత్ సరిహద్దు సమస్యలు ఇవన్నీ చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి అంచనాలు త్వరలో రుజువయ్యే అవకాశాలు లేకపోలేదని క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. 
 
అణ్వాయుధాలతో ప్రపంచ యుద్ధానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని పోప్ సంచలన కామెంట్స్ చేశారు. వాటికన్ అధికారులు, నాగసాకిపై అమెరికా అణు బాంబు వేసిన తరువాత తీసిన ఓ చిత్రాన్ని బహుకరించగా, దాన్ని చూసి చలించి పోయిన పోప్, అది తన మనసును కలచివేసిందని, దీన్ని కాపీలు తీయించి అందరికీ పంచుతాననని చెప్పారు. 
 
చిలీ పర్యటనకు బయలుదేరిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, హవాయిపై అణు దాడి జరగనుందని పొరపాటున జరిగిన ప్రచారాన్ని ప్రస్తావించారు.ఇలాంటి పొరపాట్లు విపరీత పరిణామాలకు దారీతీస్తాయని.. వీటిని చూస్తుంటే తనకు చాలా భయంగా వుందని పోప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను పెంచుకోకూడదని సూచించారు. ఏ దేశాల మధ్య యుద్ధం సంభవించకూడదని అభిలాషించారు.