శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (21:32 IST)

దుబాయ్‌లో రోబో పోలీస్....

ప్రపంచంలోని తొలి రోబో కాప్ దుబాయ్‌లో ఇటీవలే విధుల్లో చేరింది. ఐదడుగుల ఐదంగుళాలు వున్న ఈ రోబో బరువు వంద కిలోలు. ఆరు భాషలు మాట్లాడే ఈ రోబో ముఖ కవళికలను గుర్తించగలదు. ఈ రోబో జరిమానాలు వసూలు చేస్తుంది. నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తుంది.

అంతేకాదు... పోలీసు విధులకు సంబంధించి రకరకాల పనులు చేయగలదు. పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే సందేశాలను, ఆదేశాలను రిసీవ్ చేసుకుంటుంది. మాల్స్, వీధుల్లో ప్రజలకు సహాయపడుతుంది కూడా. శాంతిభద్రతల పరిరక్షణకు ఈ రోబో బ్రహ్మాండంగా పనిచేస్తోంది.