ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2017 (16:43 IST)

ఎయిర్ టెల్ రోమింగ్ బిల్లు రూ.1.86లక్షలొచ్చింది- ఇంతెలా వచ్చింది.. కస్టమర్ షాక్!

దుబాయ్ పర్యటనకు కుటుంబంతో వెళ్ళిన ఓ వ్యక్తికి టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ దిమ్మదిరిగే షాకిచ్చింది. భారత్ నుంచి కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు దుబాయ్ వెళ్ళిన ఓ వ్యక్తి.. పది రోజుల ఇంటర్నేషనల్ రోమ

దుబాయ్ పర్యటనకు కుటుంబంతో వెళ్ళిన ఓ వ్యక్తికి టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ దిమ్మదిరిగే షాకిచ్చింది. భారత్ నుంచి కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు దుబాయ్ వెళ్ళిన ఓ వ్యక్తి.. పది రోజుల ఇంటర్నేషనల్ రోమింగ్ బిల్లును చూసి షాక్ అయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీకి చెందిన నితిన్ సేథీ గత నెలలో కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడకి వెళ్లినా ఫోన్‌లో టచ్‌లో ఉండేందుకు తాను వినియోగిస్తున్న ఎయిర్‌టెల్ నుంచి పది రోజులపాటు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకున్నాడు. 
 
టూర్ ముగించుకుని భారత్‌లో అడుగుపెట్టినా అతడి ప్యాకేజీ డీ యాక్టివేట్ కాలేదు. ఫలితంగా జూన్ 8 నుంచి జూలై 7 వరకు నెల రోజులకు గాను ఏకంగా రూ.1.86 లక్షల బిల్లు వచ్చింది. దీంతో కంగుతిన్న నితిన్ వెంటనే వినియోగదారుల సేవా కేంద్రానికి ఫిర్యాదు చేయగా, సాంకేతిక కారణాల వల్లే బిల్లు తప్పుగా జనరేట్ అయ్యిందన్నారు. మరో బిల్లు పంపిస్తామని చెప్పడంతో సేథీ ఊపిరి పీల్చుకున్నాడు. ఎయిర్‌టెల్ తనకు పంపిన బిల్లును నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.