Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారతీయ వీధుల్లో పశువులు - కోతులే ఉంటాయి.. బాస్కెట్ బాల్ స్టార్

శనివారం, 12 ఆగస్టు 2017 (10:40 IST)

Widgets Magazine
kevin durant

భారత్ గురించి ప్రపంచ దేశాలన్నీ గొప్పగా చెప్పుకుంటాయి. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఎంతగానో ప్రశంసిస్తుంటారు. అయితే, ప్రపంచ బాస్కెట్ బాల్ అటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఒకడైన ఎన్బీఏ స్టార్ ఆటగాడు కెవిన్ దురాంత్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గోల్డెన్ స్టేట్ వారియర్స్ తరఫున బాస్కెట్ బాల్ ఆడే కెవిన్ ఇటీవల తాను జరిపిన భారతీయ పర్యటనపై తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలే ఇపుడు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. భారతీయులకు ఎంతమాత్రమూ తెలివితేటలు లేవని, నాలెడ్జ్ విషయంలో ఇండియన్స్ 20 ఏళ్లు వెనకుండి పోయారన్నారు. 
 
"ఇక్కడ నాకు వినూత్న అనుభూతి లభించింది. వాస్తవానికి ఇండియా గురించి నాకేమీ తెలియదు. నేను ఎక్కడికి వెళ్లినా ఆ దేశాల గురించి కొంతైనా తెలుసుకుని వెళ్లినవే. కానీ ఇండియాకు అలా రాలేదు. దుబాయ్‌కి వచ్చి, అక్కడి నుంచి ఇండియాకు వెళ్లాను. ఇక్కడి సంస్కృతిని చూశాను. తెలివితేటలు, అనుభవం విషయంలో ఇక్కడి ప్రజలు 20 ఏళ్లు వెనుకంజలో ఉన్నారు. 
 
ఇప్పటికీ వీధుల్లో పశువులు తిరుగుతున్నాయి. కోతులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటాయి. రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై వందలాది మంది పడున్నారు. ఎవరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. అత్యధికులు పేదలే" అన్నాడు. తాను సందర్శించిన తాజ్ మహల్ గురించి వివరిస్తూ, దీన్ని కాపాడటంలో మాత్రం భారత్ విజయం సాధించిందని, ఇక్కడ చాలా పరిశుభ్రత కనిపించిందని చెప్పాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

రెజ్లర్‌ ప్రాణాలు తీసిన వర్షపు నీరు.. ఎక్కడ?

వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు ...

news

రింగ్‌లో డ్రాగన్ కోరలు పీకేసిన విజేందర్ : ఇండో-చైనా బోర్డర్‌లో శాంతి నెలకొల్పాలని పిలుపు

భారత బాక్సర్ విజేందర్ సింగ్ డ్రాగన్ కోరలు పీకేశాడు. చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలిని ...

news

విజేందర్‌కు చైనా జుల్ఫికర్ ప్రతి సవాల్.. ఇంటికొస్తాడట.. బెల్టులు తీసుకెళ్తాడట!?

భారత్-చైనాల మధ్య డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో బాక్సింగ్‌లోనూ ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల ...

news

ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ ఆపుకోలేకపోయాడు... ఏం చేశాడో తెలుసా?

క్రీడా మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆ ఆటగాడికి మూత్రం వచ్చింది. ఇకేమాత్రం ఆయన ...

Widgets Magazine