ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (13:54 IST)

హైతీలో కూలిన సైనిక విమానం - ఆరుగురి మృతి

హైతీ దేశ రాజధాని పోర్ట్ యూ ప్రిన్స్ సమీపంలో ఓ సైనిక విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ మిషనరీ సభ్యులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శనివారం జరిగింది. 
 
నగరంలోని ఎయిర్ పోర్టు నుంచి నిన్న సాయంత్రం గం. 6.57 లకు బయలుదేరిన విమానం, ఓ గంట తర్వాత హైతీ దక్షిణ తీరంలో కూలిపోయిందని ఎన్సీఏఓ (నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్) ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఆరుగురితో వెళుతున్న విమానం కూలిపోగా, అందరూ మృత్యువాత పడ్డారని పేర్కొంది. విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపింది.