శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (11:48 IST)

లంక సైన్యం దాష్టీకం.. పురుషులపై లైంగికదాడులు

శ్రీలంక సైన్యం బయటకు చెప్పుకోలేని అకృత్యాలకు పాల్పడుతోందట. ముఖ్యంగా, శ్రీలంక గడ్డపై నివశించే ఈలం తమిళ పురుషులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. లైంగిక దాడులతో పాటు, సిగరెట్లతో ఒళ్లంతా

శ్రీలంక సైన్యం బయటకు చెప్పుకోలేని అకృత్యాలకు పాల్పడుతోందట. ముఖ్యంగా, శ్రీలంక గడ్డపై నివశించే ఈలం తమిళ పురుషులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. లైంగిక దాడులతో పాటు, సిగరెట్లతో ఒళ్లంతా కాల్చి, ఇనుప కడ్డీలతో చావబాదుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు సమాచారం. 
 
రాజకీయ శరణుకోరి, ప్రస్తుతం ఐరోపాలో తలదాచుకుంటున్న వీరు తమ పేరు వెల్లడించవద్దనే విన్నపంపై ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ దాష్టీకాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. 21 రోజుల పాటు చీకటి గదిలో బంధించి 12 సార్లు తనపై లైంగిక అకృత్యానికి పాల్పడినట్లు బాధితుడొకరు చెప్పారు. తనను అపహరించుకుపోయి, ఒక కారాగారంలో చీకటి గదిలో పడేశారనీ, అక్కడి గోడలపై రక్తపు మరకలూ ఉన్నాయనీ మరో బాధితుడు వెల్లడించారు. 
 
శ్రీలంకలో అంత్యర్యుద్ధం ముగిసి ఎనిమిదేళ్లయినా వేధింపులు మాత్రం 2016 నుంచి ఈ ఏడాది జులై వరకు కొనసాగాయని బాధితులు బయటపెట్టారు. కళ్లకు గంతలు కట్టి తమను తీసుకువెళ్లేవారని చెప్పారు. ఇనుప కడ్డీలను కాల్చివాతలు పెట్టేవారనీ, ఒక సంచిలో కారం వేసి దానిని తన తలపై గుమ్మరించారనీ ఇంకో వ్యక్తి తెలిపారు. మాటల్లో చెప్పలేని రీతిలో లైంగిక హింసకు పాల్పడడంతో ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మరికొందరు వెల్లడించారు. 
 
తమిళుల ఆరోపణలపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకుంటామని శ్రీలంక విదేశాంగ శాఖాధికారి తెలిపారు. బాధితులు తగిన ఆధారాలను సమర్పించాలని కోరారు. సైన్యం పలు అకృత్యాలకు పాల్పడిందన్న ఆరోపణల్ని సైన్యం కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మహేశ్‌ సేనానాయకే ఖండించారు.