Widgets Magazine

ఓనర్ కొడుకు అర్థరాత్రి వచ్చి తలుపు కొట్టి కోర్కె తీర్చమంటున్నాడు... ప్లీజ్ రక్షించండి.. (Video)

గురువారం, 27 జులై 2017 (09:23 IST)

telugu woman in dubai

పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన ఓ మహిళ అష్టకష్టాలు పడుతోంది. ఆమె పని చేసే ఇంటి యజమాని కుమారుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. ఇంటి పనిలో చేరినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడనీ, అందువల్ల తనను రక్షించాలంటూ ఆమె ప్రాధేయపడుతూ ఓ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇపుడు వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
భారత్‌కు చెందిన ఓ మహిళ గత యేడాది డిసెంబరులో ఓ కన్సెల్టెన్సీ ద్వారా షార్జాకు వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. పనిలో చేరిన తర్వాత ఇంటి యజమానితో పాటు కన్సల్టెన్సీ నుంచి సమస్యలు మొదలయ్యాయి. తన బాధలు భరించలేక ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారం రోజులు పనిచేసి నచ్చితే ఉండు.. లేకుంటే భారత్‌కు రావొచ్చిని తనకు చెప్పారని ఆమె వాపోయింది. కానీ ఇపుడు పరిస్థితి భిన్నంగా ఉందని బోరున విలపిస్తోంది. 
 
'దుబాయిలోని కన్సల్టెన్సీ నిర్వాహకులు పిలిచి డబ్బు అడిగారు. లేదని చెబితే చిత్ర హింసలు పెట్టారు. యజమాని, ఆమె భార్య కొట్టేవారు, తిట్టేవాళ్లు. నాతోపాటు ఉన్న ఫిలిప్పీన్స్ యువతుల్ని కూడా కొడుతున్నారు. వెళ్లిపోతా అని చెబితే.. 2 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్లమంటున్నారు. నరకం అనుభవిస్తున్నా.. నన్ను కాపాడండి. యజమాని పెద్ద కొడుకు చాలా దారుణంగా ప్రవర్తించేవాడు. అర్థరాత్రి ఒకటి, రెండు గంటల సమయంలో వచ్చేవాడు. నేను పడుకునే రూమ్ తలుపు కొట్టేవాడు. తీయకుంటే మరుసటి రోజు ఉదయం గొడవ చేసి కొట్టేవాడు. భరించలేకపోతున్నా' అని ఆ మహిళ తన ఆవేదన వ్యక్తంచేసింది. తాను షార్జాలో ఉండే ఇంటి అడ్రస్‌ను చెప్పింది. ఎలాగయినా తనను రక్షించాలని, భారత్‌కు పంపించాలని ఆమె ప్రాధేయపడుతోంది. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Dubai Problem House Owner Telugu Woman Video Viral

Loading comments ...

తెలుగు వార్తలు

news

పచ్చిగడ్డి కోసం చెరకుతోటలోకి వెళితే... ఉన్మాది ఏం చేశాడో తెలుసా?

చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో దారుణం జరిగింది. చెరకుతోటలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లిన ఓ ...

news

ఇక నాటకాలు వేరే ఉంటే ఆడుకోండి.. నియోజక వర్గాల పెంపు జరగదన్న కేంద్రం

అనుకున్నదే అయింది. నియోజకవర్గాల పెంపు అంటూ అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ...

news

కాంగ్రెస్ పార్టీకి జన్మలో చేతకానిదీ.. బీజేపీకి చేతనైందీ ఇదే.. అయిదు గంటల్లో కొత్త సీఎం

కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు తపస్సు చేసినా రాజకీయ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో, అమలు ...

news

లాలూ చస్తే మారడు.. అందుకే నితీశే మారిపోయాడు.. బీజేపీ స్కెచ్‌కి మహాకూటమి ఔట్

భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ...