బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

డోనాల్డ్ ట్రంప్ సవతుల కీచులాట.. ఎందుకో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నిద్రలేకుండా చేస్తున్నారు. ఉత్తర కొరియా దూకుడు చర్యలతో అమెరికా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నిద్రలేకుండా చేస్తున్నారు. ఉత్తర కొరియా దూకుడు చర్యలతో అమెరికా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే ట్రంప్‌కు మరో పోరు ఉత్పన్నమైంది. భార్య, మాజీ భార్య కీచులాటతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటిగుట్టు రచ్చకెక్కింది. 
 
తానే ప్రథమ మహిళనంటూ ట్రంప్ మాజీ భార్య ఇవానా తన పుస్తక ప్రచారకార్యక్రమంలో సరదాగా వ్యాఖ్యానించారు. అందుకు కౌంటర్‌గా ప్రస్తుత భార్య మెలానియా కార్యాలయం ప్రకటన విడుదల చేయడంతో రచ్చ వీధికెక్కింది. ట్రంప్ మొదటి భార్య ఇవానా "రైజింగ్ ట్రంప్" పేరుతో ఓ పుస్తకం రాశారు. ట్రంప్ వివాహేతర సంబంధం కారణంగానే ఆయన నుంచి విడిపోయినట్లు ఆ పుస్తకంలో ఇవానా చెప్పుకొచ్చారు. 
 
ఈ పుస్తక ప్రచార కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మొదటి భార్యను నేనే కాబట్టి, ప్రథమ మహిళను నేనే అవుతాను. మెలానియా మూడో భార్య కదా అని ఇవానా చమత్కరించారు. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శ్వేతసౌధానికి వెళ్లొచ్చు. కానీ మెలానియా ఈర్ష్య పడుతుందని వెళ్లడం లేదన్నారు. సరదాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు అగ్గి రాజేశాయి. 
 
తన పుస్తకానికి ప్రచారం కల్పించేందుకే ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేశారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. మెలానియా ప్రథమ మహిళగా గౌరవప్రదంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైట్‌హౌస్‌లో ఉండటం ఆమెకు ఇష్టం. ట్రంప్‌కు, ఆయన కుమారుడు బారన్‌కు శ్వేతసౌధాన్ని ఓ సొంతింటిలా ఆమె తీర్చిదిద్దారు అని మెలానియా అధికారిక ప్రతినిధి స్టెఫానీ గ్రీషమ్ ఆ ప్రకటనలో తెలిపారు.