గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 8 జూన్ 2020 (20:23 IST)

చైనాపై 8 దేశాలు ఏకత్వ పోరాటానికి సన్నద్ధం

మానవ హక్కుల ఉల్లంఘన, వర్తక వాణిజ్య అంశాలకు వ్యతిరేఖంగా ప్రవర్తిస్తున్న చైనాపై ప్రపంచంలో 8 దేశాలు ఏకత్వ పోరాటానికి సిద్ధమయ్యాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వ్యాప్తి వల్ల ఆర్థిక పరిస్థితులు పూర్తిగా స్తంభించిపోతున్న పరిస్థితుల్లో చైనా వాణిజ్య వ్యాపారంలో ఆక్రమణ, సరిహద్దు సమస్యల్లో హద్దులదాటి ప్రవర్తించడం వంటి పలు కుట్రలకు పాల్పడుతున్నదని ప్రపంచ దేశాలు వాటి ఆర్థిక స్థోమత, అధికార ఆధిపత్యాన్ని అణచివేయాలని 8 దేశాలు ఏకత్వ సభ్యత్వము పొంది ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేశాయి.
 
ఈ సంస్థకు 'న్యూ ఇంటర్ పార్లమెంటరీ అలయన్స్' అని పేరు పెట్టాయి. ఈ సంస్థలో అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే సభ్యత్వమును కలిగి వున్నాయి. ఈ కూటమి దృఢమైన సంస్థగా మారి చైనాపై పోరాటం కొనసాగించడానికి సిద్ధమవుతుందని ఆ దేశాలు అంటున్నాయి. ఇప్పటికే చైనా కారణంగానే కరోనా వైరస్ వివిధ దేశాలను కుదేలు చేసిందనే అసంతృప్తితో వున్నాయి. మరి భవిష్యత్తులో ఈ కూటమిలో మరిన్ని దేశాలు చేరుతాయేమో చూడాలి.