Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనాలో ఓ స్మార్ట్ దొంగ.. షట్టర్ తెరవకుండా.. నగలు దోచేశాడు..

శుక్రవారం, 18 మే 2018 (12:11 IST)

Widgets Magazine

చైనాలో ఓ ఎంత పనిచేశాడో తెలుసా.. షాపు షెట్టర్ పగులకొట్టకుండా.. గోడలు దూకకుండా.. స్మార్ట్‌గా చేతులకు పనిచెప్పి.. తన పని కానిచ్చేశాడు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనా డాంగ్‌గువాన్ సిటీలో మే 13న ఓ నగల దుకాణంలో దొంగతనం జరిగింది. ఆ దొంగ ఏవిధంగా దోచుకెళ్లాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే. నగల దుకాణంలో దొంగతనం చేద్దామని వెళ్లిన దొంగ అర్థరాత్రి షాపు ముందు నేలపై పడుకున్నాడు.
 
షట్టర్‌ను మెల్లమెల్లగా తన చేతులతో పైకి నెడుతూ, తన శరీరాన్ని గట్టిగా ఒత్తుకుంటూ షాపులోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లగానే అలారం మోగింది. అయినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా వచ్చిన పని కానిచ్చాడు. ఓ ప్లాస్టిక్ బ్యాగులో బంగారు నగల్ని సర్దుకుని.. ఎలా లోపలికి పోయాడో.. అలాగే బయటికొచ్చాడు. కానీ తతంగమంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. తెల్లారగానే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని షట్టర్‌లో తేడా చూసి ఖంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
 
స్మార్ట్ దొంగ దాదాపు 36 లక్షల విలువల నగలు చోరికి గురైనట్లు దుకాణం యజమాని పోలీసులకు చెప్పాడు. సీసీటీవీలో రికార్డయిన వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీకి సుప్రీంకోర్టు మరో షాక్ .. బలపరీక్షకు సిద్ధమన్న కాంగ్రెస్

కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని ...

news

కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ : శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష

కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి ...

news

ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలా.. పాకిస్థాన్‌లా మారిపోయింది.. మమత.. రాహుల్ ఫైర్

దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత ...

news

హల్లో దేవగౌడాజీ హ్యాపీ బర్త్‌డే.. మీకోసం దేవుడుని ప్రార్థిస్తున్నా : మోడీ ట్వీట్

తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ గౌరవాధ్యక్షుడు దేవెగౌడ శుక్రవారం ...

Widgets Magazine