Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కిమ్‌తో సత్సంబంధాలా...? నో ఛాన్స్.. అది ఫేక్ న్యూస్: డొనాల్డ్ ట్రంప్

సోమవారం, 15 జనవరి 2018 (09:53 IST)

Widgets Magazine
donald trump

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండిపోతోంది. ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వున్నాయి. ప్రపంచ దేశాలను ధిక్కరించి ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలను నిర్వహిస్తోంది. దీంతో అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌తో సత్సంబంధాలు ఉన్నట్లు తాను చెప్పలేదని అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ మాట తాను అనలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ మంచి సంబంధాలున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది. ఈ నేపథ్యంలో వాల్ స్ట్రీట్‌పై ట్రంప్ మండిపడ్డారు. 
 
ఈ దినపఈ దినపత్రిక కథనంలో చాలా అసత్యాలు ప్రచురించారని వైట్ హౌస్ కూడా ఆక్షేపించింది. సరైన సమయంలో కిమ్‌తో చర్చలు జరిపేందుకు కూడా తాను సిద్ధమని ట్రంప్ వెల్లడించినట్లు సదరు పత్రిక ఊటంకించింది. దీనిపై స్పందించిన ట్రంప్, "నేను ఏం మాట్లాడానో, దాని అర్థమేంటో వారికి బాగా తెలుసు. వారికా కావాల్సింది ఓ స్టోరీ మాత్రమే... ఫేక్ న్యూస్" అని తన అసంతృప్తి వ్యక్తం చేశారు.  
 
ఇదిలా ఉంటే.. ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గతంలో తన సీటు వద్దే న్యూక్లియర్ బటన్ వుందని వ్యాఖ్యానించారు. ఇందుకు ట్రంప్ కౌంట్ ఇచ్చారు. కిమ్ దగ్గర ఉన్నదాని కంటే అతి పెద్ద న్యూక్లియర్‌ బటన్‌ తన వద్ద ఉందన్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Misquotes Donald Trump Wall Street Journal Kim Jong Un

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత... అపస్మారక స్థితిలో కంచి స్వామి

కంచి కామకోటి పీఠాధిపతి, శంకరాచార్య జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన ...

news

పాపం టీఎన్.శేషన్ దంపతులు.. పిల్లలు లేకపోవడంతో....

దేశ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిన ...

news

భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని.. మోడీ స్వాగతం

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం ...

news

భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తాం : పాకిస్థాన్

తమ పాలకులు అనుమతిస్త భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేయనున్నట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ...

Widgets Magazine