గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (19:53 IST)

ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన పరాగ్ అగర్వాల్‌కు రూ.344 కోట్ల పరిహారం

Twitter
ట్విటర్ నుంచి ఉద్వాసనకు గురైన సీఈవో అనురాగ్ పరాగ్‌కు రూ.344 కోట్ల పరిహారం లభించనుంది. ట్విటర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అంతకుముందు వరకు ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కైవసం చేసుకోగానే పరాగ్ అగర్వాల్‌తో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్‌పై వేటు వేశారు. 
 
పరాగ్ గత 2021 నవంబరులో ట్విటర్ సీఈవోగా నియమితులయ్యారు. అప్పటివరకు ఈ బాధ్యతలను చూసిన జాక్ డోర్సే తన వారసుడుగా పరాగ్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన సీఈవోగా నియమితులైన 12 నెలల లోపు తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 
 
అంటే మన దేశ కరెన్సీలో సుమార్ రూ.344 కోట్లు. అయినప్పటికీ పరాగ్ అగర్వాల్ కోణం నుంచి చూస్తే ఈ పరిహారం పెద్ద మొత్తం కాదు. ఎందుకంటే గత 2021లో ఆయన అందుకున్న పారితోషికం 30.4 మిలియన్ డాలర్లు. అంటే రూ.250 కోట్లు. ఇపుడు ఈ పరిహారం ఒక యేడాది వేతనంతో సమానం.