ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (16:54 IST)

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

Wolf
ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రైసి ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఐతే ఈ మృతదేహాలు గుర్తుపట్టలేనివిధంగా వున్నాయి. ఘటన జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీం వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంతంలో పెద్దఎత్తున తోడేళ్లు, ఎలుగుబంట్లు వీరిపై దాడి చేసేందుకు వచ్చాయట. దాంతో కొన్ని బృందాలు భయంతో వెనుదిరిగి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదస్థలి ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం లోపల వుండటంతో సహాయక చర్యలకు తీవ్ర జాప్యం జరిగింది.
 
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు రైసీ
ఇరాన్ దేశంలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ చాపర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించినట్టు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ అధికారింగా వెల్లడించింది. అయితే, ఈ ప్రాంతంలో బతికున్నవారి ఆనవాళ్లు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఎర్ఎన్ఎన్ వెల్లడించింది. మానవరహిత విమానాలతో గాలింపు చర్యలు చేపట్టగా ప్రమాద స్థలికి సంబంధించి ఖచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్‌లు లభించవచ్చని పేర్కొంది. 
 
తావిల్ అనే ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం ధృవీకరించాల్సివుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుంది. రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు శ్రమిస్తున్నాయి. పొగమంచు, వర్షం గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. 
 
మరోవైపు, గాలంపు చర్యల కోసం 46 దళాలను రంగంలోకి దించినట్టు ఇరాన్ ప్రకటించింది. హెలికాఫ్టర్ కూలినట్టుగా అనుమానిస్తున్న ప్రదేశంలో సమీపానికి నాలుగు బృందాలు చేరిటన్టు ఐఆర్సీఎస్ అధిపతి రజీహ్ అలిష్వాండి వెల్లడించారు. ఇరాన్ - అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిల్ కలాసీ, ఖోదావరిన్ అనే రెండు డ్యామ్‌లను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో అధ్యక్షుడితో పాటు ఓ మంత్రి సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నట్టు సమాచారం.