ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (09:46 IST)

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది : ఐరాసపై అగ్రదేశాల ఒత్తిడి

జేషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రతిపాదనను భద్రతా మండలిలో పెట్టనున్నాయి. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడి తర్వాత అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని పలు దేశాలు డిమాండ్లు చేస్తున్నాయి. మొత్తం 15 సభ్య దేశాలు గల ఐరాస భద్రతా మండలిలో కీలకమైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఈసారి ముందడుగు వేశాయి. 
 
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఈ మూడు దేశాలూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా పర్యటించకుండా అత‌ణ్ణి బ్యాన్ చేయాల‌ని, ఆస్తులు.. ఆయుధాలు సీజ్ చేయాల‌ని డిమాండ్ చేశాయి.