ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (14:58 IST)

అమెరికాను భయపెడుతున్న డెల్టా వైరస్.. పెరుగుతున్న కేసులు

కరోనా వైరస్ తొలి దశ వ్యాప్తి దెబ్బకు అగ్రరాజ్యం విలవిల్లాడింది. ఊహించని సంఖ్యలో మరణాలు సంభవించాయి. న్యూయార్క్ నగరం శవాల దిబ్బగా మారింది. ఆ తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యూఎస్ ఒక యజ్ఞంలా చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 
 
అయితే, తాజాగా డెల్టా వేరియంట్ అమెరికాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా డెల్టా వేరియంట్ కేసులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ తెలిపింది. కరోనా వేరియంట్లలో డెల్టా చాలా వేగంగా వ్యాప్తిస్తోంది. దీంతో వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమెరికా వైద్య నిపుణులు డాక్టర్ ఫౌచి మాట్లాడుతూ... ఇది వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, ఎక్కువ ప్రభావాన్ని కూడా చూపుతోందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ మరింత ప్రమాదకారిగా మారుతుందని అన్నారు.