టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజులు సమయం.. అంతలోపు..?

tiktok
tiktok
సెల్వి| Last Updated: గురువారం, 26 నవంబరు 2020 (18:53 IST)
ప్రస్తుత అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగం చైనీస్ యాప్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. దీంతో డిసెంబర్ 4వ తేదీలోగా టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్ డ్యాన్స్‌కు సమయం దొరికింది. నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్ అమ్మకం ప్రక్రియను బైట్ డ్యాన్స్ పూర్తి చేయాలి.

అమెరికన్ యూజర్ల డేటాను పూర్తిగా తొలగించాలి. అమెరికా జాతీయ భద్రతను బైట్ డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తోందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ తన గత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిక్ టాక్ యాప్ వ్యాల్యుయేషన్ 50 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నది. అమెరికాలో టిక్‌టాక్‌కు 100 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

కాగా టిక్ టాక్‌ను అమెరికా సంస్థలకు విక్రయించాలని ట్రంప్ పాలనా వర్గం ఆగస్ట్‌లో ఆదేశించింది. ఈ గడువును పలుమార్లు పొడిగించింది. తాజాగా 27వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పెంచింది. ఆగస్టులో 45 రోజుల పాటు గడువు ఇచ్చారు. ప్రస్తుతం దానిని 90 రోజులకు నవంబర్ 12వరకు పొడిగించారు. అనంతరం మరో 15 రోజులు పొడిగించి, నవంబర్ 27వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఇప్పుడు మరో వారం పొడిగింపు లభించింది.దీనిపై మరింత చదవండి :