గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

నోరెళ్లబెట్టిన అమెరికా.. ఆ అణుబాంబు విస్ఫోటన సామర్థ్యం అంతనా?

ఉత్తర కొరియా ఇటీవల పరీక్షించిన హైడ్రోజన్ బాంబు విస్ఫోటన సామర్థ్యాన్ని తెలుసుకున్న అగ్రరాజ్యం అమెరికా నోరెళ్లబెట్టింది. ఈ అణుబాంబును తాము అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువని అమెరికా పర్యవేక్షణ బృందం అభి

ఉత్తర కొరియా ఇటీవల పరీక్షించిన హైడ్రోజన్ బాంబు విస్ఫోటన సామర్థ్యాన్ని తెలుసుకున్న అగ్రరాజ్యం అమెరికా నోరెళ్లబెట్టింది. ఈ అణుబాంబును తాము అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువని అమెరికా పర్యవేక్షణ బృందం అభిప్రాయపడింది. ఈ అణుబాంబు విస్ఫోటన సామర్థ్యం ఏకంగా 250 కిలో టన్నులని తెలిపింది. 
 
అంటే... 1945లో నాగసాకిపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఇది 16 రెట్లు అధికమని వివరించింది. అప్పట్లో ప్రయోగించిన అణుబాంబు 15 కిలో టన్నులు మాత్రమేనని గుర్తు చేసింది. కాగా, ఇటీవల ఉత్తరకొరియా అణుపరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. 
 
ఈ పరీక్ష దాటికి భూమి 6.3 తీవ్రతతో కంపించింది. ఈ హైడ్రోజన్ బాంబు సామర్థ్యాన్ని దక్షిణ కొరియా, జపాన్‌లు 160 కిలో టన్నులుగా అంచనా వేయగా, ఈ అంచనా తప్పని దాని సామర్థ్యం 250 కిలోటన్నులని అమెరికా పర్యవేక్షణ బృందం స్పష్టం చేసింది.