Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గాలి జనార్థన్ రెడ్డి 'కుడి భుజం'కు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:44 IST)

Widgets Magazine
sriramulu

గాలి జనార్థన్ రెడ్డి. ఈ పేరు దేశంలో తెలియనివారుండరు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం. ఎందుకంటే.. ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్‌గా చెలామణి అయిన గాలి జనార్థన్ రెడ్డి గత యూపీఏ ప్రభుత్వంలో అష్టకష్టాలు పడ్డారు. మైనింగ్ అక్రమ రవాణా కేసులో ఏకంగా రెండేళ్ళకు పైగా జైలుశిక్షను అనుభవించి, ప్రస్తుతం బెయిలుపై విడుదలై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుడి భుజంగా చెలామణి అయిన బళ్ళారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానం అందింది. 
 
సాధారణంగా అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయతీగా వస్తోంది. ఇప్పుడు ట్రంప్ కూడా విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో విందును ఏర్పాటు చేశారు. 
 
ఈ విందుకు భారత్ నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కాగా, మరొకరు శ్రీరాములు. వీరిద్దరికీ ఇప్పటికే వైట్ హౌస్ నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని అనుభూతిగా ఆయన పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Invite Sriramulu Us President Donald Trump Bellary Lok Sabha Mp

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రగ్రహణం రోజున మెరుపు వేగంతో వెళ్లిన వస్తువు (వీడియో)

చంద్రగ్రహణం రోజున బ్లూబ్లండ్ మూన్ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన ...

news

భార్యను చంపి పాకిస్థాన్ మంత్రి ఆత్మహత్య

పాకిస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి ఒకరు తన భార్యను ...

news

నన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే రేప్ చేశాడు : జర్నలిజం విద్యార్థిని ఫిర్యాదు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై జర్నలిజం విద్యను ...

news

బాబూ.. హరిబాబు.. ఎపిలో మనం గెలిచే అవకాశం ఉందా? అమిత్ షాకు ఎంత ధైర్యమో?

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకులు సమావేశం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ...

Widgets Magazine