సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (15:38 IST)

డొనాల్డ్ ట్రంప్‌తో ఆ సంబంధమా.. అబ్బే లేదండి: కొట్టిపారేసిన పోర్న్ స్టార్ క్లిఫోర్డ్

భారత్‌లో సన్నీలియోన్‌కు ఎంత క్రేజుందో.. అమెరికాలో స్టోమీ డేనియల్స్‌ (అసలు పేరు స్టెఫానీ క్లిఫోర్డ్) కు కూడా అంతే క్రేజుంది. ఈమెతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రేమాయణం సాగించాడని.. వీరిద్దరూ లై

భారత్‌లో సన్నీలియోన్‌కు ఎంత క్రేజుందో.. అమెరికాలో స్టోమీ డేనియల్స్‌ (అసలు పేరు స్టెఫానీ క్లిఫోర్డ్) కు కూడా అంతే క్రేజుంది. ఈమెతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రేమాయణం సాగించాడని.. వీరిద్దరూ లైంగికంగా కలిశారని జోరుగా ప్రచారం సాగుతోంది. 2006లో స్టోమీని ట్రంప్ గెస్ట్‌హౌస్‌లో కలిశాడని.. అప్పటికే ట్రంప్‌ మూడోసారి మెలానియాను పెళ్లి చేసేసుకున్నాడని వార్తలొచ్చాయి. 
 
ట్రంప్‌కు పేరుకే మూడు పెళ్లిళ్లు, ట్రంప్ వ్యవహారాలు లెక్కలేనన్ని వున్నాయని టాక్. ఈ నేపథ్యంలో స్టోమీతో ట్రంప్ సంబంధాలున్నాయని.. ఆమెను అధ్యక్ష ఎన్నికల సమయంలో కొంత మొత్తాన్నిచ్చి సెటిల్ చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా పోర్న్ స్టార్ స్టోమీ ఖండించింది.  డొనాల్డ్ ట్రంప్‌తో అఫైర్ సాగించినట్లు వచ్చిన కథనాలను తోసిపుచ్చింది. 
 
ట్రంప్ స్టోమీ సంబంధాలపై వచ్చిన కథనాల్లో వాస్తవం లేదంటూ ఆమె తరఫు న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు. అటు ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కొహెన్ కూడా ఈ అఫైర్ కథనాలను తోసిపుచ్చారు.