కరోనా రక్కసికి సరైన మందు అదే.. ఏం చేయాలంటే?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ఉత్తమమని గ్లోబల్ వర్క్‌ప్లేస్ అనలిటిక్స్ ప్రెసిడెంట్ కేట్ లిస్టర్ తెలిపారు. కరోనాను కట్టడి చేయాలంటే.. వర్క్ ఫ్రం హోం ఒక్కటే పరిష్కారమని లిస్టర్ వ్యాఖ్యానించారు.
ఇకపోతే.. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సీన్ ఇంకా అందుబాటులోకి రానందున ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం సర్వసాధారణం కావచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే పద్ధతిని కొనసాగించడానికి మొగ్గు చూపిస్తున్నాయని కేట్ లిస్టర్ చెప్పారు.
ఇక టీసీఎస్‌లోని 3.5 లక్షల మంది ఉద్యోగులలో 75 శాతం మంది 2025 నాటికి ఇంటి నుంచే పని చేస్తారని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం ప్రకటించారు. అంటే 25 శాతం మంది ఉద్యోగులే కార్యాలయంలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో 30 మిలియన్ల మంది ఉద్యోగులు రెండేళ్లపాటు ఇంటి నుంచి పనిచేస్తారని గ్లోబల్ వర్క్ ప్లేస్ అనలిటిక్స్ అంచనా వేసింది. తమ కంపెనీలో 25 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని కోరుకుంటున్నామని టెక్ మహీంద్రా ఎంపీ గుర్నానీ చెప్పారు.
అలాగే న్యూఢిల్లీ, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, పారిస్ నగరాల్లో వర్క్ ఫ్రం హోం అమలు వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచి అధిక పనిచేస్తూ తక్కువ కాలుష్యంతో మెరుగైన జీవితం సాగిస్తున్నారు.