Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవల్లి కథ అలా పుట్టింది.. జక్కన్న మహాభారతం తీసే ఛాన్సుంది: విజయేంద్ర ప్రసాద్

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (14:16 IST)

Widgets Magazine
vijayendraprasad

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన రచయిత, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం శ్రీవల్లి అనే సినిమాకు స్క్రిప్ట్ రాశారు. అంతేకాదు... ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ సినిమాపై విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఆలోచనలకు.. మానసిక విశ్లేషణకు అనుగుణంగా ఈ కథ వుంటుందని చెప్పారు. వైజాగ్‌లో తనకు రమేష్ అనే మిత్రుడుండే వాడని.. అతడు 2010లో వినాయక చతుర్థి  ముందు రోజే చనిపోయాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. 
 
తనకోసం ఎంతో కాలం వేచి చూసిన ఆయన.. చివరి క్షణాల్లో తనను తలచుకున్నాడని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తన మిత్రుడిని చూడాలనుకున్నా.. వైజాగ్‌కు ఆతడు చనిపోయిన రెండేళ్లకు తర్వాత వెళ్లి.. షాక్ అయ్యానన్నారు. 2010లో వినాయక చవితి ముందురోజు ఆ మిత్రుడిని చూడాలని తనకి ఎంతగానో అనిపించిందని అన్నారు. మనసు రమేష్ వైపే లాగిందని, అయితే అప్పుడు వెళ్లలేకపోయిన తాను, ఆ తరువాత రెండేళ్లకు వైజాగ్‌లోని అతనింటికి వెళ్తే.. అంతలో అతడు కన్నుమూశాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ బాధలో నుంచి శ్రీవల్లి కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
 
ఇక బాహుబలి దర్శకుడు, తనయుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా భావించే మహాభారతం గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రాజమౌళి 'మహాభారతం' తీస్తాడని తాను ఇంతకుముందు తానెక్కడా చెప్పలేదన్నారు. కానీ ప్రస్తుతానికి చెప్పేదేమిటంటే.. జక్కన్న తప్పకుండా మహాభారతం తీసే అవకాశం ఉందని తెలిపారు. రాజమౌళికి యుద్ధాలు అంటే ఎంతో ఇష్టమనీ, వాటికోసమైనా ఆయన 'మహాభారతం' తెరకెక్కించవచ్చునని వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్‌ సినిమా నైజాం రైట్స్‌ అదుర్స్: బాహుబలికి తర్వాత రూ.29కోట్లకు అజ్ఞాతవాసి?

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ మూవీని హారిక ...

news

హార్దిక్ పాండ్యా-పరిణీతి చోప్రాలపై వ్యంగ్య పోస్టులు.. చంకలో కోలానా, పాండ్యానా?

క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా-పరిణీతి చోప్రా మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందంటూ గత కొంతకాలంగా ...

news

దెయ్యం సినిమా భారీ సక్సెస్: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ''ఇట్'' (Trailer)

హాలీవుడ్ కొత్త థ్రిల్లర్ ''ఇట్'' ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అమెరికాలో కూడా ఈ ...

news

షాలిని పాండే బెస్ట్.. అన్ని విధాలా పనికొస్తుందట...

టాలీవుడ్ యువ హీరో నాగ చైత‌న్య‌ - త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన ...

Widgets Magazine