ఈ శతకం మామకు అంకితం... అంబటి రాయుడు (వీడియో)

సోమవారం, 14 మే 2018 (12:11 IST)

ఐపీఎల్ 2018 టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ను అంబటి రాయుడు ఎడాపెడా ఉతికిఆరేశాడు. అలా ఇలా బాదలేదు.. శతకం బాదేశాడు. కళాత్మక విధ్వంసం సృష్టిస్తూ కళ్లుచెదిరే శతకంతో చెన్నైకు అద్భుత విజయం అందించాడు.
ambati rayudu
 
ఈ మ్యాచ్ అనంతరం అంబటి రాయుడు స్పందిస్తూ, సన్‌రైజర్స్‌పై అద్భుత రీతిలో చెలరేగి అజేయ శతకాన్ని తన మేనమామకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. రాయుడు మేనమామ మెండు సత్యనారాయణ ఆదివారం ఉదయం మరణించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
 
నిజానికి ట్వంటీ20ల్లో ఓపెనింగ్‌ స్థానం చాలా ముఖ్యమైంది. ఈ స్థానంలో ఆడడాన్ని ఆస్వాదిస్తున్నా. ఓపెనింగ్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 4 రోజుల క్రికెట్‌లో రాణిస్తే  ఏ స్థానంలో అయిన బ్యాటింగ్‌ చేయగలం అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 62 బంతులు ఎదుర్కొన్న అంబటి రాయుడు.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో వంద పరుగులు చేశాడు.
 దీనిపై మరింత చదవండి :  
సీఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ Csk Ambati Rayudu Chennai Super Kings Maiden Ipl Century అంబటి రాయుడు

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్ 2018: అదరహో.. అంబటి.. హైదరాబాద్‌పై చెన్నై ఘనవిజయం

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ ...

news

ఐపీఎల్-11: హమ్మయ్య.. కోహ్లీసేన ఢిల్లీపై గెలిచింది.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ...

news

ఐపీఎల్ 11- చెలరేగిన నరైన్.. 75 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్.. కేకేఆర్ విన్

ఐపీఎల్ పదకొండో సీజన్లో భాగంగా ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ...

news

ఐపీఎల్ -11: సన్‌రైజర్స్‌దే అగ్రస్థానం.. రైనా, ఆండ్రూల రికార్డ్ అదుర్స్

వేసవిలో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ ...