ఐపీఎల్ 2018: అదరహో.. అంబటి.. హైదరాబాద్‌పై చెన్నై ఘనవిజయం

సోమవారం, 14 మే 2018 (11:07 IST)

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు అదరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా చెన్నై విజయభేరీ మోగించింది.
ambati rayudu
 
ఆదివారం తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 79 పరుగులు చేయగా, విలియమ్సన్‌ 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 51 రన్స్ చేసింది. 
 
ఆ తర్వాత 180 పరుగుల ఛేదనలో రాయుడు ప్రత్యర్థికి ఊపిరాడనీయలేదు. ఈ ఐపీఎల్‌లో గొప్ప బౌలింగ్‌ దళంగా పేరుపడిన సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు. భువి బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలు పెట్టిన అంబటి.. ఇక ఆగలేదు. పరుగులు ఇవ్వడంలో పిసినారులైన షకిబ్‌, రషీద్‌ఖాన్‌, కౌల్‌ బౌలింగ్‌నైతే ఉతికేశాడు. కౌల్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌తో అర్థసెంచరీ చేసుకున్న రాయుడు.. రషీద్‌కూ ఓ సిక్స్‌ వడ్డించాడు. 
 
ముఖ్యంగా, అంబటి రాయుడు 62 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 100 (నాటౌట్) సన్‌రైజర్స్‌ బౌలర్లను ఉతికారేశాడు. అలాగే, అతనితో పాటు వాట్సన్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో చెలరేగడంతో 57 పరుగులతే చెలరేగిపోయాడు. ఫలితంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 8 వికెట్లతో చిత్తు చేసిన చెన్నై (12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు) పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.దీనిపై మరింత చదవండి :  
పూణె సీఎస్కే సన్‌రైజర్స్ హైదరాబాద్ అంబటి రాయుడు Ton Victory ఐపీఎల్ 2018 Ipl 2018 Csk Srh Pune Ambati Rayudu Full Cricket Score

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్-11: హమ్మయ్య.. కోహ్లీసేన ఢిల్లీపై గెలిచింది.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ...

news

ఐపీఎల్ 11- చెలరేగిన నరైన్.. 75 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్.. కేకేఆర్ విన్

ఐపీఎల్ పదకొండో సీజన్లో భాగంగా ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ...

news

ఐపీఎల్ -11: సన్‌రైజర్స్‌దే అగ్రస్థానం.. రైనా, ఆండ్రూల రికార్డ్ అదుర్స్

వేసవిలో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ ...

news

అనిల్ కుంబ్లే ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. ఇంతకు అదేంటి?

కర్ణాటక ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతున్న వేళ అదే రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ అనిల్ ...