Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్-11: హమ్మయ్య.. కోహ్లీసేన ఢిల్లీపై గెలిచింది.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

ఆదివారం, 13 మే 2018 (11:25 IST)

Widgets Magazine

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌ను రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి.. ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌ చెలరేగడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఓటమితో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్లే ఆఫ్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ ఆటగాళ్లలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 40 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేయగా.. ఏబీ డివిలియర్స్‌ 37 బంతుల్లో 4  ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. 
 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆటగాళ్లలో ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా, జాసన్‌ రాయ్‌లను వెంటవెంటనే చాహల్‌ వెనక్కి పంపాడు. అయినప్పటికీ ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ చెలరేగడంతో స్కోరువేగం పెరిగింది. 
 
శ్రేయర్‌ అయ్యర్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌‌మెన్‌ అభిషేక్‌ శర్మ తన మొదటి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లోనే 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 21 పరుగులు చేసిన విజయ్‌శంకర్‌తో కలిసి.. ఢిల్లీకి భారీస్కోరును అందించాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలలో 181 పరుగులు సాధించింది. అయితే ఢిల్లీ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి డూ ఆర్‌ డై స్థితిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్‌ అవకాశాలను నిలుపుకుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
కోహ్లీసేన ఢిల్లీ డేర్ డెవిల్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ డివిలియర్స్ Kohli Ipl 2018 Delhi Daredevils De Villiers Royal Challengers Bangalore

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్ 11- చెలరేగిన నరైన్.. 75 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్.. కేకేఆర్ విన్

ఐపీఎల్ పదకొండో సీజన్లో భాగంగా ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ...

news

ఐపీఎల్ -11: సన్‌రైజర్స్‌దే అగ్రస్థానం.. రైనా, ఆండ్రూల రికార్డ్ అదుర్స్

వేసవిలో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ ...

news

అనిల్ కుంబ్లే ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. ఇంతకు అదేంటి?

కర్ణాటక ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతున్న వేళ అదే రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ అనిల్ ...

news

చెన్నై విజయాలకు బ్రేక్.. బట్లర్ అదుర్స్.. రంగు మార్చిన రాజస్థాన్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్థాన్ చుక్కలు చూపించింది. ఈ ...

Widgets Magazine