శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (10:12 IST)

రహానేను తప్పించారా షాకైన దాదా.. డే/నైట్ టెస్టులాడే సత్తా మనోళ్లకుంది..

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డే అండ్ నైట్ టెస్టులపై స్పందించాడు. డే నైట్ టెస్టు నెగ్గే సత్తా టీమిండియాకు వుందని గంగూలీ వ్యాఖ్యానించాడు. భవిష్యత్‌ అంతా ఇక పింక్ బాల్ టెస్టుదేనని గంగూలీ అభిప్రాయ

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డే అండ్ నైట్ టెస్టులపై స్పందించాడు. డే నైట్ టెస్టు నెగ్గే సత్తా టీమిండియాకు వుందని గంగూలీ వ్యాఖ్యానించాడు. భవిష్యత్‌ అంతా ఇక పింక్ బాల్ టెస్టుదేనని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏదో ఒకరోజు డే అండ్ నైట్‌ టెస్టు ఫార్మాట్‌కు అన్ని దేశాలూ ఓకే చెప్పాల్సిందేనని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
టెస్టు హోదా కలిగిన దేశాల్లో భారత్, బంగ్లాదేశ్‌ టెస్టు హోదా కలిగిన దేశాల్లో భారత్‌, బంగ్లాదేశ్‌లో పింక్‌ బాల్‌ మ్యాచ్‌లకు సంసిద్ధంగా లేదని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఆప్ఘనిస్థాన్‌తో టెస్టుకు దూరంగా వుండాలనే కోహ్లీ నిర్ణయాన్ని కూడా గంగూలీ సమర్థించాడు. కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవడానికి కోహ్లీకి ఇంగ్లండ్‌ టూర్‌ ఎంతో ముఖ్యమన్నాడు. 
 
ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు రహానెను జట్టు నుంచి తప్పించడంపై దాదా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలు అడుగంటినట్టేనన్నాడు. తనకు అవకాశం ఇస్తే, రాయుడు కంటే ముందుగా కచ్చితంగా రహానేను తీసుకుంటాను. ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఆడిన అనుభవం రహానేను వుంది. ఇంగ్లండ్‌లో రహానేకు మంచి రికార్డు కూడా వుందని దాదా గుర్తు చేశాడు. కానీ రహానేను తప్పించడం కఠినమైన నిర్ణయమని గంగూలీ వ్యాఖ్యానించాడు.