శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : శనివారం, 26 మే 2018 (17:27 IST)

ఐపీఎల్ 2018 : ఆ సెంటిమెంట్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు పునరావృతం చేసేనా?

స్వదేశంలో గత నెలన్నర రోజులుగా సందడి చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2018) 11వ సీజన్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగనుం

స్వదేశంలో గత నెలన్నర రోజులుగా సందడి చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2018) 11వ సీజన్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు విషయంలో యాదృచ్ఛికంగా కొన్ని విషయాలను ఇక్కడ జరిగాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
* 2011లో జరిగిన ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించిన తొలిజట్టు. 
* 2018లో కూడా ఫైనల్‌కు అర్హత సాధించిన జట్టు కూడా చెన్నై సూపర్ కింగ్సే. 
 
* 2011లో పాయింట్ల పట్టికలో సీఎస్కే జట్టు రెండో స్థానంలో నిలిచింది. 
* 2018లో కూడా ఇదే జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 
 
* 2011 టోర్నీలో లీగ్ మ్యాచ్‌లలో సీఎస్కే జట్టు 9 మ్యాచ్‌లు గెలుపొందగా, ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. 
* 2018లో కూడా ధోనీ గ్యాంగ్ 9 మ్యాచ్‌లలో విజయం సాధించగా, 5 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. 
 
* 2011లో సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 350 పైచిలుకు పరుగులు చేయగా, ఇందులో 20కి పైగా సిక్స్‌లు ఉన్నాయి. 
* 2018లో కూడా ధోనీ 350కిపైగా పరుగులు చేయగా, 20కి పైగా సిక్స్‌లు ఉన్నాయి. 
 
* ఇక చివరగా, 2011లో పాయింట్ల పట్టికలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఆఖరు స్థానంలో నిలిచింది. 
* 2018లో కూడా ఇదే జట్టు చివరి స్థానంలో ఉంది. 
 
* 2011లో చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ విజేతగా నిలిచింది. 
* మరి 2018 టోర్నీ విజేత.. చెన్నై సూపర్ కింగ్సేనా? ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.