శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (12:23 IST)

ఐపీఎల్ 2018 : కోల్‌కతా అవలీలగా.. ఢిల్లీపై ఘనవిజయం

ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుపై అవలీలగా విజయంసాధించింది. రెండు పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా జూలు విదల్చడంత

ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుపై అవలీలగా విజయంసాధించింది. రెండు పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా జూలు విదల్చడంతో గంభీర్‌ సేన (ఢిల్లీ జట్టు) విలవిల్లాడింది. దీంతో కేకేఆర్‌ 71 పరుగుల తేడాతో నైట్‌రైడర్స్‌ ఘనవిజయం సాధించింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 200 పరుగులు చేసింది. నితీష్‌ రాణా (35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59), రస్సెల్‌ (12 బంతుల్లో 6 సిక్సర్లతో 41) విజృంభించగా.. ఊతప్ప (19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35), లిన్‌ (29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. 
 
ఆ తర్వాత 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కేవలం 14.2 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు రిషభ్‌ (26 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), మాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47) మాత్రమే రాణించారు. మిగిలినవాంతా చేతులెత్తేయడంతో 71 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. కేకేఆర్ జట్టు బౌలర్ కుల్దీప్‌ మూడు, నరైన్‌ మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రాణాకు దక్కింది.