శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (11:57 IST)

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి అద్భుతం... అసలేం జరిగింది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే తొలిసారి అద్భుతం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్ హెచ్) జట్టు కేవలం 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇలా ఓ జట్టు 12 పాయింట్లతో నాకౌట్ దశకు వెళ్లడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తొలి మూడు స్థానాల్లో నిలిస్తే, హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచి.. ప్లేఆఫ్స్‌లో బెర్త్ కొట్టేసింది. మొదటి మూడు జట్లు అన్ని కూడా 18 పాయింట్లు సాధించాయి. అయితే, వాటి నెట్‌ రన్‌రేట్(ఎన్ఆర్ఆర్)లో వ్యత్యాసం వల్ల స్థానాల్లో మార్పు వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 
 
ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ సారథ్యంలోని కేకేఆర్ తొమ్మిది వికెట్లతో తేడాతో ఘోర పరాజయం పొందడం ఆరేంజ్ ఆర్మీకి కలిసొచ్చింది. దీంతో కోల్‌కతా, హైదరాబాద్ రెండు కూడా 12 పాయింట్లు సాధించినట్లైంది. 
 
కానీ, ఎస్ఆర్‌హెచ్ నెట్‌రన్‌రేట్ (+0.58) ఉండగా, కేకేఆర్‌కు (+0.03) ఉంది. దాంతో ఎన్ఆర్ఆర్ మెరుగ్గా ఉన్న హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లో బెర్త్ దక్కించుకుంది. ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడనుంది.