గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (17:49 IST)

ధోనీని చెన్నై పక్కనబెట్టేస్తేనే మంచిది.. చెప్పిందెవరు?

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇందుకు కెప్టెన్ ధోనీతో పాటు ఆ జట్టు క్రికెటర్లు ఫామ్‌లో లేకపోవడం కారణంగా చెప్తున్నారు క్రీడా పండితులు.

ఐపీఎల్ 13వ సీజన్‌లో చెన్నై పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్‌కు చేరని సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టుకు ప్రవేశం కల్పించాలంటే బీసీసీఐ 2021 సీజన్‌కు మెగా వేలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. 
 
అయితే మెగా వేలం నిర్వహిస్తే చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని వదులుకోవడమే ఆ జట్టుకు ప్రయోజనమని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ధోనీని విడిచిపెట్టిన తర్వాత రైట్ టూ కార్డ్‌ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందని తెలిపాడు. 
 
అలా కాకుండా రిటైన్డ్ ప్లేయర్‌గా జట్టుతో కొనసాగిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బును నష్టపోతారని అన్నాడు. మెగా వేలానికి ఎంఎస్ ధోనీని చెన్నై పక్కనబెట్టాలని చెప్పాడు. అప్పుడే డబ్బు మిగులుతుందని చెప్పుకొచ్చాడు. అలాగే జట్టు కూడా బలోపేతం అవుతుందని వెల్లడించాడు.