ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ లవ్వాయణం.. ప్రాచీ సింగ్ ప్రేమలో పృథ్వీ షా..?

Prithvi Shaw
సెల్వి| Last Updated: గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:32 IST)
Prithvi Shaw
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో జట్లన్నీ సమరానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో యువ ప్లేయర్‌ పృథ్వీ షా(20) కీలకపాత్ర పోషించనున్నాడు.

రాబోయే 13వ సీజన్‌లో సత్తాచాటేందుకు షా ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. తాజాగా టీవీ, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన యువ నటితో పృథ్వీ ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కలర్స్‌ టీవీలో ప్రసారమయ్యే ఉడాన్‌ సిరీయల్‌లో నటి ప్రాచి సింగ్‌ నటించింది. సోషల్‌మీడియాలో వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో వున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకరి పోస్ట్‌కు మరొకరు తప్పకుండా కామెంట్‌ లేదా ఎమోజీతో రీప్లే ఇస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా.. యంగ్ ఇండియా ఓపెనర్ పృథ్వీ షాను టీమిండియా క్రికెట్ జట్టులో ఆడకపోయినా బాగా పాపులర్ అయ్యాడు. పృథ్వీ షా టీమ్ ఇండియా తరఫున ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడకపోయినా.. జూనియర్ క్రికెట్‌లో అద్భుతంగా స్కోరు చేసిన తర్వాత షా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2018 ఐసీసీ యూ-19 ప్రపంచ కప్‌లో భారత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.దీనిపై మరింత చదవండి :