మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 24 అక్టోబరు 2020 (09:33 IST)

IPL 2020, MI vs CSK: ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఔట్, అందుకే ఓడాం: ధోనీ

ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో మాజీ ఛాంపియన్లు చైన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. దీనితో ఐపీఎల్ రేసు నుంచి తప్పుకున్నట్లయింది. కాగా రెండో గేమ్ నుంచి తన జట్టు తన సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో విఫలమైందని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శుక్రవారం అంగీకరించాడు.
 
సామ్ కుర్రాన్ 52 పరుగులు చేసినా ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే జట్టు ముంబై ఇండియన్స్ ముందు 115 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. ముంబై ఇండియన్స్ జట్టులోని ఇషాన్ కిషన్ 37 బంతుల్లో అజేయంగా 68 పరుగులు చేయడంతో, అతని ప్రారంభ భాగస్వామి క్వింటన్ డి కాక్ 37 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేయడంతో వారి విజయం నల్లేరుపై నడకలా సాగింది. దీనితోటోర్నమెంట్ చరిత్రలో సిఎస్‌కె 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇదే మొదటిసారిగా రికార్డు సృష్టించింది.