గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (14:31 IST)

లలిత్ మోదీ బెంగళూరుకు ఆడకపోతే కెరీర్ నాశనం చేస్తానన్నాడు..

lalith modi
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడాలనుకుంటున్నట్లు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ తెలిపాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టీమ్‌తో ఉండాల్సిందిగా ఐపీఎల్ బాస్ లలిత్ మోడీ బెదిరించాడని ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశాడు. బెంగళూరు చాలా దూరంలో ఉందని, అక్కడి ఆహారం తనకు సరిపడదని వివరించాడు. 
 
ఐపీఎల్‌ నుంచి ఎవరో పేపర్‌పై తన సంతకం తీసుకున్నారని ప్రవీణ్‌ తెలిపాడు. అయితే అది కాంట్రాక్ట్ పేపర్ అని అతనికి అప్పుడు తెలియదు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. లలిత్ మోదీ తనకు ఫోన్ చేసి బెంగళూరు జట్టుకు ఆడకపోతే ఐపీఎల్‌లో కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడని చెప్పాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.
 
 క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ సర్వసాధారణమని ప్రవీణ్ కుమార్ అన్నారు. 
 
ట్యాంపరింగ్ 1990లలో మొదలైంది. దాదాపు ప్రతి ఫాస్ట్ బౌలర్ రివర్స్ స్వింగ్ సాధించేందుకు ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నాడని వివరించాడు. 
 
ఈ విషయం అందరికీ తెలుసునని ప్రవీణ్ అన్నాడు. ఇప్పుడు మైదానం అంతా కెమెరాలు ఉండడంతో మైదానంలో ప్రతి ఆటగాడి చిన్నపాటి కదలికలు కూడా రికార్డు అవుతున్నాయని, ట్యాంపరింగ్ ఆరోపణలు ఎక్కువయ్యాయన్నారు. 
 
అందరూ చేస్తున్నప్పటికీ పాక్ ఆటగాళ్లు ఇందులో ప్రమేయం ఉన్నారని తాను విన్నానని, ట్యాంపరింగ్ ఎక్కువగా చేసేది వాళ్లేనని ప్రవీణ్ చెప్పాడు.