'ఆండ్రాయిడ్ ఫోన్ల'కు ఏజెంట్ స్మిత్ భయం

agent smith
Last Updated: గురువారం, 11 జులై 2019 (17:31 IST)
ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించే యూజర్లకు ఏజెంట్ స్మిత్ భయం పట్టుకుంది. ఏజెంట్ స్మిత్ అంటే ఇదో మొబైల్ మాల్‌వేర్ (హానికారక వైరస్). గతంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు.. భారత్‌ను గడగడలాడించిన ఈ వైరస్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడినట్టు చెక్ పాయింట్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. వీటిలో సగానికిపైగా ఆండ్రాయిడ్ ఫోన్లు భారత్‌లో ఉన్నట్టు తెలిపింది.

యూజర్లకు తెలియకుండానే... వారి ఫోన్లలో ఉన్న మొబైల్‌ అప్లికేషన్ల స్థానంలో, వాటినే పోలిన హానికారక వెర్షన్లను ప్రవేశపెడుతున్నట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ మాల్‌వేర్‌ ముఖ్యంగా హిందీ, అరబిక్, రష్యన్, ఇండోనేషియా భాషలు మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది.

నిజానికి ఈ తరహా మాల్‌వేర్ ఇప్పటివరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు... ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలలోని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఈ వైరస్ బారినపడినట్టు గుర్తించారు. ఇపుడు భారత్‌లో కోటిన్నర మంది ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వైరస్ ఉన్నట్టు చెక్‌పాయింట్ సంస్థ వెల్లడించింది. అయితే, ఇదే విషయంపై గూగుల్‌ను సంప్రదించగా, ఈ తరహా వైరస్ యాప్ తమ ప్లే స్టోర్‌లో లేదని స్పష్టం చేసింది.దీనిపై మరింత చదవండి :