ఎయిర్‌టెల్ హాట్‌స్పాట్‌పై బంపర్ ఆఫర్..

airtel
Last Updated: బుధవారం, 8 మే 2019 (17:38 IST)
ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఓ శుభవార్తను వెల్లడించింది. ఈ సంస్థకు చెందిన 4జీ హాట్‌స్పాట్‌ను వినియోగించేవారి కోసంగా ఓ ప్రత్యేక ఆఫర్‌ను వెల్లడించింది. ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ డివైస్ వినియోగ‌దారుల‌ు ఆ డివైస్‌లో వాడే ఎయిర్‌టెల్ సిమ్‌కుగాను ఇక‌పై రూ.399 ప్లాన్‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది.

ఇక ఆ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు నెల‌కు 50 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. డేటా అయిపోగానే స్పీడ్ 80 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఇక ఈ హాట్‌స్పాట్ డివైస్‌ను వినియోగ‌దారులు రూ.999 కే అమెజాన్ సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చని పేర్కొంది.

కాగా, రూ.399 ప్లాన్‌లో ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ డివైస్‌కు వ‌చ్చే 50 జీబీ డేటాను పూర్తిగా వినియోగించ‌క‌పోతే మిగిలిన డేటా మర‌స‌టి నెల‌కు క్యారీ ఫార్వార్డ్ అవుతుందని కూడా ఎయిర్‌టెల్ తెలిపింది.

ఇక ఈ డివైస్‌లో వినియోగదారులు క‌చ్చితంగా ఎయిర్‌టెల్ సిమ్ వేయాలి. సిమ్ తీసేస్తే దానికి అందించే బెనిఫిట్స్‌ను క‌స్ట‌మ‌ర్లు కోల్పోతారు. కాగా ఈ డివైస్‌క 10 ఇత‌ర డివైస్‌ల‌ను ఒకే సారి క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. దీన్ని ఒక‌సారి పుల్ చార్జింగ్ చేస్తే 6 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంది.దీనిపై మరింత చదవండి :