శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (16:11 IST)

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌..

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌ను లాంఛ్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తాజాగా 180 రోజుల వ్యాలీడిటితో సరికొత్త రూ.899 ప్యాక్‍ను ఆవిష్కరించింది. ఈ ప్యాక్ ప్రకారం రోజుకి 1.5 జీబీ ఉచిత డేటా లభించే ఈ ఆఫర్ కింద.. ఏపీ, తెలంగాణ సర్కిల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. 
 
ఈ ఆఫర్‌లో ముంబై, ఢిల్లీ సర్కిల్ మినహాయించి.. అపరిమిత కాల్స్.. రోజుకు 50 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకునే వీలుంటుంది. మొత్తానికి అర్థ సంవత్సరానికి గాను రూ.899 ప్లాన్ ప్రకారం 270జీబీని వాడుకోవచ్చు. ఇంకా రూ. 999 ప్లాన్ ప్రకారం 365 రోజులకు అన్ లిమిటెడ్ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్టీడీ కాల్స్‌ను పొందవచ్చు.