సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (15:07 IST)

మీ కంప్యూటర్లను ఇక గవర్నమెంట్ చూస్తూ వుంటుందట..

మీరు ఉపయోగించే కంప్యూటర్లను ఇక ఎవరైనా చూడొచ్చు. ఇదేంటి అని షాకవుతున్నారా..? అయితే చదవండి. దేశంలోని ఏ కంప్యూటర్‌నైనా పర్యవేక్షించే అధికారాన్ని సీబీఐతో సహా పది వ్యవస్థలకు అనుమతులు ఇస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రస్తుతం కంప్యూటర్ లేనిదే ఈ వ్యవస్థ పనిచేయట్లేదు. ఇక వ్యక్తిగతంగా ఎందరో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడటం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్నీ కంప్యూటర్లలో గల డేటాను పర్యవేక్షించడం, షేర్ చేసే డేటాలో వున్న సమాచారాన్ని గమనించడం కోసం కేంద్రం పది భద్రతా వ్యవస్థలకు కంప్యూటర్లను వీక్షించే అనుమతులను జారీ చేసింది. 
 
ఇంటలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్స్, డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సీబీఐ, నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ, కేబినేట్ సెక్రట్రియేట్ (ఆర్అండ్ఎడబ్ల్యూ), డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటలిజెన్స్, (జమ్మూ కాశ్మీర్, అస్సాం) ఢిల్లీ పోలీసులకు  కూడా ఈ అనుమతులను కేంద్ర హోం శాఖ అప్పగించింది. ఈ పది శాఖల ద్వారా ఎలాంటి కంప్యూటర్లో వున్న డేటాను అత్యాధునిక టెక్నాలజీతో పొందడం చేయొచ్చు. 
 
ఈ శాఖలకు తగిన వివరాలను అందించని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని కేంద్రం వెల్లడించింది. దేశ భద్రత కోసమే డేటాపై కన్నేయాల్సి వచ్చిందని కేంద్రం చెప్తున్నప్పటికీ.. వ్యవస్థలకు సంబంధించిన డేటాల సంగతిని పక్కన బెట్టినా.. వ్యక్తిగత కంప్యూటర్లపై నిఘా పెట్టడం సరైన పద్ధతి కాదంటూ విమర్శలు వస్తున్నాయి.