శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (14:45 IST)

జర్మనీలో అమేజాన్‌కు ఆంక్షలు.. గూగుల్ తరహాలో..?

జర్మనీలో అమేజాన్‌.కామ్‌పై ఆంక్షలు తప్పేట్లు లేవు. గతంలో గూగుల్‌ మాతృసంస్థ కూడా ఈ దేశంలో ఆంక్షలకు గురైంది. కాంపిటేషన్‌ నియమాలను ఉల్లంఘించినందుకు గానూ ఈ ఆంక్షలు విధించే అవకాశం ఉందని జర్మనీ మోనోపోలీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అచిమ్‌ వాంబచ్‌ వెల్లడించారు.
 
అమేజాన్ ప్రైమ్ సర్వీసుల్లో వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఎక్స్‌క్లూజివ్ సినిమాలు, వెబ్‌సీరీస్‌లు కూడా ఉన్నాయి. దాంతో జర్మనీ ఫెడరల్‌ కంపెనీ సభ్యత్వ నమోదు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. 
 
గత ఏడాది యూరోపియన్‌ యూనియన్‌ గూగుల్‌కు దాదాపు 4.3 బిలియన్‌ డాలర్లను ఫైన్‌గా విధించింది. అప్పట్లో యాంటీ ట్రస్ట్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆంక్షలు విధించింది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌ తయారీదారులు ఒక్క గూగుల్‌నే ఉపయోగించేలా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయరు చేయకుండా అడ్డుకొంది.