శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (12:59 IST)

ఫేస్‌బుక్‌కి ఝలక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..

కేంద్ర ఎన్నికల కమిషన్ సోషియా మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కి సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన విశ్వాస్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే ఓంప్రకాష్ శర్మ మార్చి 1వ తేదీన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫోటోతో పాటు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల ఫోటోలతో ఉన్న రెండు పోస్టర్లను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసారు. 
 
కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ అభినందన్ వర్థమాన్ ఫోటోలను బీజేపీ ఎమ్మెల్యే శర్మ ఫేస్‌బుక్ ఖాతా నుంచి తొలగించాలని ఆదేశించింది. అంతేకాకుండా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వంలో భారత సైన్యం గురించి ప్రస్తావించవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శబరిమల పేరుతో ఓట్లు అడగరాదంటూ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, నాయకులను ఇప్పటికే హెచ్చరించింది. దీనితో పాటు శబరిమల వివాదం, దానిపై సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. మతం పేరుతో ఎన్నికల ప్రచారం చేయడం కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.