శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (13:57 IST)

భారత్‌లో తొలిసారి 5జీ : 3 మిల్లీ సెకన్లలో 5.7 జీబీపీఎస్

భారత్‌లో తొలిసారి 5జీ సేవలను ఎరిక్‌సన్ సంస్థ పరిచయం చేసింది. ఈ రేడియో తరంగాలు ఏం చేయగలవో తొలిసారి లైవ్ చేసి చూపించింది. 3 మిల్లీ సెకన్లు... అంటే కనీసం రెప్పపాటు సమయం కూడా కాదు.

భారత్‌లో తొలిసారి 5జీ సేవలను ఎరిక్‌సన్ సంస్థ పరిచయం చేసింది. ఈ రేడియో తరంగాలు ఏం చేయగలవో తొలిసారి లైవ్ చేసి చూపించింది. 3 మిల్లీ సెకన్లు... అంటే కనీసం రెప్పపాటు సమయం కూడా కాదు. అంత తక్కువ సమయంలో ఏం చేస్తాం? 5వ తరం రేడియో తరంగాలు ఏం చేయగలవో ఇండియాలో తొలిసారిగా లైవ్ చూపించింది ఎరిక్ సన్ సంస్థ. 
 
తమ 5జీ టెస్ట్ బెడ్‌పై సెకనులో 3వ వంతు కన్నా తక్కువ సమయంలో 5.7 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను చూపి ఓ అద్భుతాన్ని కళ్లముందు చూపింది. భారత మార్కెట్లో 2026 నాటికి 5జీ సాంకేతికత 27.3 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసేంత స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు ఎరిక్ సన్ సంస్థ పేర్కొంది. 
 
భారత మార్కెట్లో తమ సంస్థ తొలిసారిగా లైవ్ 5జీ స్పీడ్‌ను చూపించిందని తెలిపింది. భారత మార్కెట్లో అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని, సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటాను నమోదు చేయడమే తమ లక్ష్యమని ఎరిక్ సన్, మార్కెట్ ఏరియా హెడ్ నుంజియో మిర్టిల్లో వ్యాఖ్యానించారు. భారత్‌లో మరో రెండేళ్లలో 5జీ సేవలను తాము ప్రారంభించనున్నామని తెలిపారు.
 
ఇండియాలో గిగాబిట్ ఎల్టీఈ విస్తరణ కోసం తాము వేచి చూస్తున్నామని తెలిపారు. 5జీ తరంగాలు అందుబాటులోకి వస్తే, ఇప్పుడున్న టెలికం ఆదాయం 43 శాతం మేరకు పెరుగుతుందని ఎరిక్ సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ వెల్లడించారు.