Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లేంటో తెలుసా?

మంగళవారం, 3 అక్టోబరు 2017 (11:30 IST)

Widgets Magazine
Google Pixel XL 2

టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సల్ సిరీస్‌లో భాగంగా మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్లను బుధవారం మార్కెట్‌లోకి అందుబాటులో రానుంది. 
 
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరగనున్న ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సల్ 2, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఇపుడు ఈ ఫోన్లకు చెందిన ఇమేజ్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీంతోపాటు ఈ ఫోన్లకు చెందిన పలు స్పెసిఫికేషన్ల వివరాలు కూడా చూచాయగా తెలుస్తున్నాయి. 
 
గూగుల్ పిక్సల్ 2 ఫోన్‌లో 4.97 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2లో 5.99 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లలోనూ 4 జీబీ ర్యామ్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా వంటి ఫీచర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇక ఈ ఫోన్ల ధరల విషయానికి వస్తే పిక్సల్ 2కు చెందిన 64 జీబీ వేరియెంట్ రూ.49వేలు, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2కు చెందిన 64 జీబీ వేరియెంట్ రూ.55వేలుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

కష్టమర్లకు జియో షాక్.. రోజుకు 5 గంటలు మాత్రమే ఫ్రీకాల్స్

రిలయన్స్ జియో తన కష్టమర్లకు తేరుకోలేని షాకిచ్చింది. ఇపుడు ఇస్తున్న అపరిమత ఉచిత కాల్స్‌పై ...

news

పేలిపోతున్న ఐఫోన్ 8.. వినియోగదారుల గగ్గోలు!

మొబైల్ ఫోన్ దిగ్గజం ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 8, 8 ప్లస్ విడుదలై నెలరోజులైనా కాకముందే అప్పుడే ...

news

ఈ వారంలోనే ఎయిర్‌టెల్ 4జీ చౌక ఫోన్...

రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన 4జీ ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఓ 4జీ ఫోన్‌ను తయారు ...

news

రూ.2 వేలకే మైక్రోమ్యాక్స్ 4జీ ఫీచర్ ఫోన్

దేశంలో పుట్టుకొచ్చిన టెలికాం విప్లవం పుణ్యమాని వివిధ రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ...

Widgets Magazine