16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లు బ్లాక్.. కేంద్రం కీలక నిర్ణయం
చైనా యాప్‌లపై ఇప్పటికే కొరఢా ఝుళిపించిన కేంద్రం.. తప్పుడు సమాచారాన్ని అందించే సామాజిక మాధ్యమాలపై గుర్రుగా వుంది. ఇందులో భాగంగా తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లు బ్లాక్ చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెళ్ల వీక్షకుల సంఖ్య 68 కోట్లకు పైగా ఉందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ పేర్కొంది. వీటిలో 10 భారతీయ వార్తా ఛానెళ్లు ఉండగా.. 6 పాకిస్థాన్ ఆధారిత యూట్యూబ్ వార్తా ఛానెళ్లు ఉన్నట్టు ప్రకటించింది.
భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు చర్యలు తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.