హానర్ 10 లైట్ కొత్త స్మార్ట్ ఫోన్.. 15 నుంచి ఫ్లిఫ్‌కార్టులో మాత్రమే...

Last Updated: బుధవారం, 9 జనవరి 2019 (13:04 IST)
మొబైల్ తయారీ సంస్థ హానర్ నుంచి హానర్ 10 లైట్ విడుదల కానుంది. ఈ నెల 15వ తేదీ సంక్రాంతికి కానుకగా ఫ్లిఫ్ కార్ట్‌లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీంతో హానర్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల కోసం ప్రత్యేక పేజీని కేటాయించింది. గ్రీన్ 710- ఎస్.ఓ.సీలో పనిచేసే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్, 24 మెగాపిక్సల్ కెమెరా, గ్రాడియంట్ బ్యాక్ ప్యానల్‌ను కలిగివుంటుంది.
 
ఫ్లిఫ్ కార్ట్‌లో మాత్రమే హానర్ స్మార్ట్ ఫోన్... స్కై బ్లూతో పాటు బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో లభ్యమవుతుంది. ఇప్పటికే చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది నవంబర్‌లో విడుదల చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 4జీ రామ్, 64 జీబీ సామర్థ్యంతో రూ.14వేలకు విక్రయించబడుతోంది. ఇంకా 6జీబీ రామ్, 64జీబీ సామర్థ్యం కలిగిన ఈ హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో రూ.17,500వేల ధర పలుకుతోంది. 
 
అలాగే 6జీబీ రామ్, 128జీబీ సామర్థ్యం కలిగిన హానర్ ఫోన్.. రూ.19,500 పలుకుతుందని హానర్ సంస్థ ప్రకటించింది. భారత్‌లోనూ హానర్ ఫోన్ ఇదే రేటు పలికే అవకాశం వుంది. ఈ హానర్ 10 లైట్ ఆండ్రాయిడ్ 9.0 పైలో పనిచేస్తుంది. ఫుల్ హెచ్డీని ఉపయోగించుకోవచ్చు. ఇంకా 24 మెగాపిక్సల్ కెమెరాతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందని హానర్ వెల్లడించింది. దీనిపై మరింత చదవండి :