Widgets Magazine

రూ.13,999కి తగ్గిన జియోమీ ఎమ్ఐ ఏ2

Last Updated: సోమవారం, 7 జనవరి 2019 (14:10 IST)
జియోమీ నుంచి ఏ2 ధర తగ్గింది. రూ.16,999కి పలికిన ఈ ఫోన్ ధరను ప్రస్తుతం 13,999కి అందిస్తున్నట్లు జియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులో భారత మార్కెట్లోకి వచ్చిన 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ను కలిగివుంటుంది. 
 
జియోమీ ఎమ్ఐ ఏ2 ధర భారత్‌లో రూ.13,999కి పలుకుతుంది. అలాగే 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పనిచేసే ఇదే మోడల్ 16,499కి కస్టమర్ల అందుబాటులో వుంటుంది. ఎమ్‌డాట్‌కామ్, అమేజాన్ ఇండియా వెబ్ సైట్లలో ఈ ఫోన్ పొందవచ్చు. ఈ ఫోన్ వెయ్యి రూపాయల డిస్కౌంట్‌లో లభిస్తాయని జియోమీ వెల్లడించింది. 
 
జియోమీ ఎమ్ఐఏ2 ఫీచర్స్
డుయెల్ సిమ్ 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
5.99 ఇంచ్‌ల ఫుల్ హెచ్డీ (1080x2160 పిక్సెల్) డిస్‌ప్లే 
ప్రైమరీ కెమెరాలో 12 మెగాపిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్486 సెన్సార్


దీనిపై మరింత చదవండి :